చింతలరేవు హనుమ

చింతలరేవు హనుమ
సాధారణంగా తాము తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని వినాయకుడిని ప్రార్ధిస్తుంటారు. ఇందుకు అవసరమైన పూజలు చేయడానికి వినాయకుడి ఆలయానికే వెళుతుంటారు. అయితే మెదక్ జిల్లా చింత రేవుల పరిసర ప్రాంతాల భక్తులు మాత్రం ఇందుకు భిన్నంగా హనుమంతుడి ఆలయానికి వెళుతుంటారు.

ఏ పని అయినా ఒకసారి ఆయన చెవిన వేస్తే అది తప్పకుండా జరుగుతుందని అంటారు. ఇక్కడ స్వామిని దర్శించుకుని తమ కష్ట నష్టాలు చెప్పుకుంటే అవి వెంటనే తీరిపోతాయని చెబుతారు. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి చింతరేవుల అనీ ... ఇక్కడి స్వామికి చింతలు తీర్చే హనుమంతుడని పేరు వచ్చింది.

ప్రాచీన కాలం నాటి ఈ క్షేత్రంలో తొలినాళ్లలో స్వామి ఉగ్రమూర్తిగా అనిపించేవాడట. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న శ్రీ వ్యాసరాయల వారు ఆ విషయాన్ని గ్రహించి, స్వామివారు శాంతించేలా ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ చేసినట్లుగా స్థలపురాణం చెబుతుంది. ఇక స్వామివారు ఇక్కడ అవతరించిన విషయానికే వస్తే ... పూర్వం శేషప్ప అనే ఓ వ్యక్తి జీవితంపట్ల విరక్తి కలగడంతో, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

అతను ఈ ప్రదేశానికి వచ్చి ఓ పాములపుట్టలో చేయి పెట్టాడు. పాము కరవలేదు గాని అతని చేతికి చల్లగా ఏదో తగలడంతో లోపలికి చూశాడు. పుట్టలో హనుమంతుడి విగ్రహం కనిపించడంతో, దగ్గరలోని కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి ఆ పుట్టను కరిగించాడు. ఆ విగ్రహాన్ని బయటికి తీసి పూజాభిషేకాలు నిర్వహించాడు. కాలక్రమలో స్వామికి ఆలయ నిర్మాణం జరిగి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రతియేటా స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవ సంబరాలు చూసి తీరాల్సిందే.

More Bhakti Articles