దీపారాధన ఫలితం
ఏ పూజ అయినా ... ఏ వ్రతమైనా .. ఏ శుభకార్యమైనా దీపారాధనతోనే మొదలవుతుంది. ఇక దీపారాధన అనేది ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. సాధారణంగా పుట్టింటి వారికి పుణ్య ఫలాలు లభించడం కోసం ఒక వత్తి ... అత్తింటి వారి తరఫున పుణ్య ఫలాలను ఆశిస్తూ ఒక వత్తి కలిపి రెండు వత్తులను వెలిగిస్తూ ఉండటం ఆచారంగా వస్తోంది.
ఇక అయిదు వత్తులతో దీపారాధన చేసే వాళ్లు కూడా లేకపోలేదు. అయిదు వత్తుల దీపారాధన అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ... అరుంధతితో చెప్పినట్టుగా శాస్త్రాలలో కనిపిస్తుంది. భర్త ఆయురారోగ్యాలను ఆశిస్తూ ఒక వత్తి ... పిల్లల అభివృద్ధిని ఆశిస్తూ రెండవ వత్తి ... తన పుట్టింటి వారి యోగ క్షేమాలను కోరుకుంటూ మూడవ వత్తి ... కీర్తి ప్రతిష్ఠలను ఆశిస్తూ నాల్గొవ వత్తి ... సమస్త దోషాలు తొలగిపోవడం కోసం అయిదవ వత్తిని వెలిగించడం జరుగుతుందని అంటారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే పరమ పవిత్రమైన దీపారాధన, చీకట్లనే కాదు పాపాలను సైతం తరిమేసి సుఖసంతోషాల వెలుగును ప్రసాదిస్తుంది. వెలుతురు ప్రవాహమై మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది.