సహపంక్తి భోజనం
ఇటీవల కాలంలో ఏ శుభకార్యానికి వెళ్లినా, భోజనాల దగ్గరికి వచ్చే సరికి ఎవరికి వారు వడ్డించుకుతినే పద్ధతే కనిపిస్తోంది. కొందరు మాత్రం సంప్రదాయాన్ని గౌరవిస్తూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక పద్ధతిలో జరిగే భోజనాల ఏర్పాట్ల వలన, శుభకార్యానికి హాజరైన వారిలో ఎవరు భోజనాలు చేశారో ... ఎవరు చేయలేదో తెలియదు. కానీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి బంధువులే వడ్డించినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఆచారం ప్రకారం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు, ముందుగా భోజనం చేసినప్పటికీ అందరూ భోజనం చేయడం పూర్తయ్యేంత వరకూ పైకి లేవకూడదని అంటుంటారు. సహపంక్తిలో పెద్దవాళ్లు కూడా కూర్చుంటూ వుంటారు గనుక, వాళ్లని గౌరవిస్తూ వారి భోజనం పూర్తయ్యేంత వరకూ మిగతా వాళ్లు వేచివుండటం జరుగుతుంది. ఇక ఈ విధానంలో అసలైన కారణం మరొకటి లేకపోలేదు.
సాధారణంగా సహపంక్తి భోజనానికి కూర్చున్నప్పుడు అందరి శరీర భాగాలలోని విద్యుత్ ఒకే రకమైన నియంత్రణను కలిగి వుంటుంది. ఈ కారణంగా సహపంక్తిలో నుంచి ఎవరైతే ముందుగా పైకి లేస్తారో వారు ఇతరుల శక్తిని గ్రహిస్తారు. అలాగే అందరికన్నా చివరన భోజనం చేసి పైకి లేచినవారు తమ శక్తిని ఎక్కువగా కోల్పోతారని అంటారు. ఈ విధానాన్ని నియంత్రించడం కోసమే సహపంక్తి చేసినప్పుడు అందరూ ఒకేసారి పైకి లేవడమనే ఆచారాన్ని మన పూర్వీకులు పాటిస్తూ వచ్చారు.