రవిగ్రహ ప్రభావం

రవిగ్రహ ప్రభావం
నవగ్రహాలలో రవి గ్రహానికి ఎంతో విశిష్టత వుంది. జాతకంలో ఆయన స్థితి సరిగ్గా లేకపోవడం వలన ఆ జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రవి అనుగ్రహం లేకపోవడం వలన కుటుంబ పరమైన కలహాలు ఏర్పడతాయి. ఏ రంగంలో వున్నా అందులో ఆశించిన స్థాయికి చేరుకోకపోవడం జరుగుతూ వుంటుంది. ఫలితంగా నిరాశా నిస్పృహలు నిలువునా కాల్చేస్తుంటాయి.

ఈ గ్రహ ప్రభావం కారణంగా నమ్మిన వారిచేతిలో మోసపోవడం జరుగుతుంది. పరాజయాలు ... అవమానాలు అడుగడుగునా కుంగదీస్తుంటాయి. అయితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టే ... ప్రతి దోషానికి ఒక నివారణ వుంటుంది. అట్లాగే రవి గ్రహానికి అధిష్టాన దేవత అయిన శ్రీమహా విష్ణువును పూజించడం వలన, రవి చూపే వ్యతిరేక ఫలితాలనుంచి బయటపడవచ్చు.

ప్రతినిత్యం ' ఓం నమో నారాయణాయ'అనే అష్టాక్షరీ మంత్రాన్ని పఠించడం వలన రవి వలన కలిగే దోషాలు నివారించబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే 'ద్వాదశ ముఖి' రుద్రాక్షను ధరించడం వలన కూడా రవి చూపే దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నాయి.

More Bhakti Articles