వాస్తు పురుషుడు
ప్రాచీనకాలం నుంచి నేటి వరకూ వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. గృహ నిర్మాణం తలపెట్టిన వారు సాధ్యమైనంత వరకూ తమ పరిధిలో వాస్తును గురించి తెలుసుకునే రంగంలోకి దిగుతుంటారు. ఎందుకంటే వాస్తులో ఏ మాత్రం తేడా వచ్చినా సిరిసంపదలు కోల్పోవడానికి ... ఆరోగ్యానికి దూరమై అవస్థలు పడటానికి ఎంతో కాలం పట్టదు. ఈ కారణంగానే అందరూ వాస్తుకి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు.
అందరూ ఇంతటి ప్రాముఖ్యతను ఇస్తోన్న వాస్తు పురుషుడు, పరమశివుడి నుదుటి నుంచి జాలువారిన చెమట బిందువులో నుంచి ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. వాస్తుపురుషుడు ఆకాశాన్ని సైతం ఆక్రమిస్తుండగా, బ్రహ్మ ఆదేశానుసారం దేవతలు అతణ్ణి భూమిపైకి అధో ముఖంగా పడదోసి అతను లేవకుండా ఆయా శరీర భాగాలపై నిలుచున్నారు.
వాస్తుపురుషుడు ఆవేదన వ్యక్తం చేయడంతో, గృహ నిర్మాణాలు చెప్పట్టే వారు ముందుగా అతనిని పూజిస్తారంటూ వరాన్ని ప్రసాదించాడు. అలా పూజించని వారికి ఆ దోషం మనఃశాంతి లేకుండా చేస్తుందని చెప్పాడు. అలా బ్రహ్మ నుంచి వరాన్ని పొందిన వాస్తు పురుషుడు, నేటి ఆధునిక కాలంలోనూ తన విశిష్టతను చాటుకుంటున్నాడు.