వివాహ పద్ధతులు
ప్రాచీన భారతీయ వివాహ వ్యవస్థను పరిశీలిస్తే అష్టవిధ వివాహాలు కనిపిస్తాయి. ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి అష్టవిధ వివాహాలు ఆచరణలో ఉన్నప్పటికీ, వాటిలో చతుర్విధ వివాహాలు మాత్రమే ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఒకటి బ్రాహ్మీ వివాహం కాగా మిగతా మూడు స్థానాలను 'గాంధర్వ వివాహం' ... 'క్షత్రియ వివాహం' ... 'రాక్షస వివాహం' ఆక్రమించాయి. అయితే వీటిలో కూడా ఆనాటి సమాజంలోని వారు 'బ్రాహ్మీ వివాహానికే ఎక్కువగా మొగ్గుచూపారు.
పెద్దల అనుమతితో మహర్షులు సూచించిన పద్ధతిలో సంప్రదాయ బద్ధంగా జరిగే వివాహాన్ని 'బ్రాహ్మి వివాహం' అని అంటారు. ఇక కొన్ని సందర్భాల్లో యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించుకుని, పెద్దల అనుమతిలేకుండానే వివాహం చేసుకుంటూ వుంటారు. కులమతాలు ... ఆర్ధికపరమైన వ్యత్యాసాలు తమ వివాహానికి అడ్డుపడతాయని భావించి వీరు రహస్యంగా పెళ్లి చేసుకుంటూ వుంటారు. దీనినే గాంధర్వ వివాహమని అంటూ వుంటారు.
ఇక పూర్వం క్షత్రియులలో బల ప్రదర్శనను బట్టి కన్యామణిని చేపట్టే ఆచారం వుంది. కన్య మనసుతో గానీ ... ఆమె అభిప్రాయంతో గాని పనిలేకుండా భుజబలంతో పరీక్షకు నిలబడి ఆమెను చేపట్టేవారు. ఈ విధానాన్ని క్షత్రియ వివాహమని అంటారు. 'రాక్షస వివాహం' విషయానికే వస్తే ... తాను మనసు పడిన కన్యకు మరొకరితో వివాహం తలపెట్టినప్పుడు, ఆ కన్యను తీసుకుని వెళ్లి పెళ్లాడటమనేది రాక్షస వివాహం క్రిందికి వస్తుంది. రుక్మిణిని ఈ విధంగానే తీసుకెళ్లి శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి.