శనిదోష నివారణ

శనిదోష నివారణ
అలలా .. కలలా సాఫీగా సాగిపోతోన్న జీవితంలోకి శని ఎప్పుడు ప్రవేశిస్తాడో ఎవరికీ తెలియదు. ఇక శని ప్రవేశించడమంటూ జరిగిందా అంటే జీవితం తలక్రిందులు అయినట్టుగా అనిపిస్తుంది ... జీవితమే వ్యర్ధమనిపిస్తుంది. అంతగా మనిషిని పీల్చిపిప్పిచేస్తాడాయన. విద్యా ... ఉద్యోగం ... వ్యాపారం ఇలా ప్రతిదానిలోనూ ఆటంకాలు సృష్టిస్తుంటాడు. వివాహాది శుభకార్యాలకు అడ్డుపడుతుంటాడు.

వ్యసనాలకు బానిసను చేసి ... అనారోగ్యాలు సృష్టించి కుటుంబ పరంగా మనః శాంతిలేకుండా చేస్తుంటాడు. అందువలన ఆయన అనుగ్రహాన్ని సంపాదించడానికే అందరూ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు. హోమాలు ... జపాలు శనిని శాంతింపజేసేవే, అయితే శని దోష నివారణకి మరో మార్గం కూడా లేకపోలేదు.

శనికి అధిష్టాన దేవత వేంకటేశ్వర స్వామి కనుక నిత్యం ఆ ఏడుకొండల స్వామిని పూజించడం వలన శని ప్రభావం నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. ఇక వీలైనంత వరకూ పశు పక్ష్యాదులకు ఆహారాన్ని సమకూర్చడం వలన కూడా శనికి ప్రీతీ కలిగించి, ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని శాస్త్రం చెబుతోంది.

More Bhakti Articles