కపిలేశ్వర పురం

కపిలేశ్వర పురం

కపిలేశ్వర పురం
పుణ్య క్షేత్రాలలో ... నదీ తీరంలో వెలసిన పుణ్య క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అలా గోదావరి నదీ తీరంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు అలరారుతున్నాయి. వాటిలో 'కపిలేశ్వర పురం' ఒకటి. పూర్వం కపిలమహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వలన ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. నవగ్రహాల ప్రతికూలత కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం, నారదమహర్షి ఈ నదీ తీరంలో నవజనార్ధన ఆలయాలకు రూపకల్పన చేశాడు. కాలక్రమంలో ఈ నవజనార్ధన ఆలయాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి.

కపిలేశ్వర పురంలో కొలువుదీరిన జనార్ధన స్వామి, భక్తులపాలిట కామధేనువుగా ... కల్పతరువుగా పూజలు అందుకుంటున్నాడు. శుక్ర గ్రహ దోష నివారణకుగాను నారదుడు ఇక్కడ ఈ స్వామిని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ గ్రహ దోషం నుంచి బయటపడి స్వామివారి అనుగ్రహం పొందడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. గతంలో ఈ క్షేత్రం పై కూడా మతపరమైన దాడులు జరిగాయి. అయితే స్థల ప్రాశస్త్యం కారణంగా ... భక్తులకున్న బలమైన విశ్వాసం కారణంగా ఈ క్షేత్రం ఇప్పటికీ తన వైభవాన్ని చాటుకుంటూనే వుంది.

విశేషమైన పర్వదినాల్లో స్వామివారికి ఇక్కడ జరిగే ఉత్సవాలు ... ఊరేగింపులు చూసితీరవలసిందే. ఇటు ప్రకృతి పరమైన ఆహ్లాదాన్ని ... అటు ఆధ్యాత్మిక పరమైన పరవశాన్ని కలిగించే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించ వలసిందే.

More Bhakti Articles