పళని
కుమార స్వామి కొలువైన పుణ్య క్షేత్రాలలో 'పళని' ముందువరుసలో కనిపిస్తుంది. తమిళనాడులోని పళనిలో వెలసిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని భక్తులు భావిస్తుంటారు. పళని అంటే 'జ్ఞానఫలం' అని అర్థం ... ఇక్కడ కుమార స్వామి 'గిరివాలం' అనే పేరుగల కొండపై నిలిచి భక్తులచే పూజలు అందుకుంటున్నాడు.
ఇక్కడి మూలవిరాట్టు ప్రాచీనమైనదని చెబుతుంటారు. సాధారణంగా కుమార స్వామి చక్కని అలంకరణతో 'శక్తి' ఆయుధాన్ని ధరించి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తాడు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామి 'మొల వస్త్రం' మాత్రమే ధరించి దర్శనమిస్తుంటాడు. ఎలాంటి అలంకరణలు లేకుండా తలపైనా ... మెడలోను ... చేతులకు రుద్రాక్ష మాలలు, కాళ్లకు పాదుకలు మాత్రమే ధరించి నిరాడంబరంగా కనిపిస్తాడు. ఒక చేతిలో శక్తి ఆయుధం, మరొక చేతిలో కర్ర వంటి దానిని పట్టుకుని నిలుచుని ఉంటాడు.
ఈ స్వామిని దర్శించాలంటే కదంబ వృక్షాలతో నిండిపోయిన కొండను ఎక్కాల్సిందే. కుమార స్వామి జన్మించిన కృత్తికా నక్షత్రాన్నే తమిళులు 'అగ్ని నక్షత్రం' అని పిలుస్తుంటారు. ఈ 'అగ్ని నక్షత్రం' పేరుతోనే ప్రతియేడు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వేసవికాలంలో జరిగే ఈ ఉత్సవాలకి మండే ఎండలను సైతం లెక్కచేయక భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.
ఈ కొండపై కదంబ వృక్షాలతో పాటు అనేక ఔషధ గుణాలు గల మొక్కలు ఉంటాయి. వీటిపై నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన అనేక రుగ్మతలు నశిస్తాయని చెప్పుకుంటూ వుంటారు. ఈ కారణంగానే చాలా మంది ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటారు. కోరిన కోరికలను నెరవేర్చే కొండంత దైవంగా భక్తులు ఇక్కడి స్వామివారిని సేవించి తరిస్తుంటారు.