కేతుగ్రహ ప్రభావం
వివిధ రాశులలో జన్మించినవారికి గ్రహ సంచారం కారణంగా అనుకూల ... ప్రతికూల ఫలితాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా రాహు - కేతువుల ప్రభావాన్ని తట్టుకోవడం కష్టం కనుక వారిని శాంతింపజేసే పనిలోనే చాలా మంది ఉంటూ వుంటారు. కేతువు విషయానికే వస్తే, సాధ్యమైనంత వరకూ బుద్ధిని పక్కదారి పట్టించే ప్రయత్నమే చేస్తుంటాడు. మంచి పనులు చేయాలనే ఉద్దేశం మనసులో తలెత్తిన్నప్పటికీ, దానిని ఆచరణలో పెట్టనీయకుండా అన్ని రకాలుగా అడ్డుపడుతుంటాడు.
ఈ సమయంలో ఎవరు హితవు చెప్పినా వారిని కూడా అపార్థం చేసుకునే పరిస్థితులను కల్పిస్తాడు. తనకి ఎవరూ లేరు ... తాను ఒంటరిని అనే ఆలోచనలను కలిగించి వ్యసనాలకు బానిసను చేస్తాడు. ఈ కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా చేసి, నలుగురూ నానారకాలుగా మాట్లాడుకునే స్థాయికి దిగజారుస్తాడు. అందువలన కేతువు అంటే చాలామందిలో ఒకరకమైన భయం వుంటూనే వుంటుంది.
ఇక కేతు గ్రహానికి జరిపించే జపతపాల విషయాన్ని పక్కన పెడితే, కేతు గ్రహానికి అధిష్టాన దేవత అయిన వినాయకుడిని అనునిత్యం పూజించడం వలన కూడా దోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా నలుపు - తెలుపు రంగులో గల కుక్కలకు ప్రతి రోజు ఏదో ఒక ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన కూడా కేతుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చునని సూచిస్తున్నాయి.
పుణ్యక్షేత్రాలలో కేతుగ్రహానికి శాంతి పూజలు చేయించినా, ఇంటికి తిరిగి వచ్చాక మిగిలిన రెండు విషయాలను తేలికగా ఆచరణలో పెట్టవచ్చు. భూతద్దంలో నుంచి కనిపించే సమస్యలను భూతదయతో తొలగించుకోవచ్చు.