రుద్రాక్ష విశిష్టత

రుద్రాక్ష విశిష్టత
పరమశివుడి కన్నీటి బిందువులే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయి. అలాంటి రుద్రాక్షలు ఎంతో విశిష్టమైనవిగా ... మరెంతో మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి. సాధారణంగా రుద్రాక్షలు ఒక ముఖం నుంచి పద్నాలుగు ముఖాలను కలిగి వుంటాయి. వీటిలో ఒక్కో రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను కలిగి వుంటుంది. ఇవి పాపాలను ... దోషాలను ... వ్యాధులను తరిమికొట్టే శక్తిని కలిగి వుంటాయి. అంతే కాకుండా జీవితాన్ని ఆనందమయం చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి.

'ఏకముఖి' రుద్రాక్ష ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. 'ద్విముఖి' మానసిక వ్యాధుల విషయంలో తిరుగులేని మందులా పనిచేస్తుంది. ఇక 'త్రిముఖి' వివాహ ప్రాప్తిని కలిగించగా ... 'చతుర్ముఖి' విద్యా ప్రాప్తిని ... 'పంచముఖి' ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాయి. అప్పుల బాధల నుంచి బయటపడేయడంలో 'షణ్ముఖి' ... ఏలినాటి శని బారి నుంచి బయటపడేయడంలో 'సప్తముఖి' కీలకమైన పాత్రను పోషిస్తాయి.

ఇక 'అష్టముఖి' సర్పదోష నివారణ చేయగా ... 'నవముఖి' సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. అపమృత్యు దోషమేదైనా వుంటే అది 'దశముఖి' ని ధరించడం వలన తీరిపోతుంది. 'ద్వాదశముఖి' సంపదను ... 'చతుర్దశ ముఖి' అధికారాన్ని అందిస్తాయి. రుద్రాక్షలకు గల ఆయా గుణాలను బట్టి వాటిని ధరించడం వలన ఆశించిన ఫలితాలను అందుకోవడానికి అవకాశం వుంటుంది.

More Bhakti Articles