దసరా
అటు పురాణ సంబంధమైన విషయాలకు ... ఇటు ఇతిహాసాలకు సంబంధించిన సంఘటనలకు వేదికగా నిలిచిన పండుగ దసరా. తెలుగువారి సంస్కృతికీ ... సంప్రదాయాలకు ఈ పండుగ పెద్దపీట వేస్తుంది. ఆశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నవరాత్రులను నిర్వహిస్తారు ... వీటినే శరన్నవరాత్రులనీ ... దేవీ నవరాత్రులని అంటారు. శక్తి క్షేత్రాలలో ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాలుగా అలంకరించి పూజిస్తూ వుంటారు.
శైలపుత్రి ... బ్రహ్మ చారిణి ... చండ ... ఘంటా ... కూష్మాండ ... స్కందమాత ... కాత్యాయని ... కాళరాత్రి ... మహాగౌరి ... సిద్ధిధాత్రి అనే తొమ్మిది రూపాలలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. లోక కంటకులైన తొమ్మిది మంది రాక్షసులను ఒక్కో రోజున ఒక్కో అవతారంలో అమ్మవారు సంహరించి విజయం సాధించిన సందర్భంగా, పదో రోజున అంటే దశమి తిథిన ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ కారణంగా ఈ దశమి ... విజయ దశమిగా పిలవబడుతోంది.
దసరా అనే మాట దశహరా అనే సందర్భంలో నుంచి పుట్టింది. దశహరా అంటే ... పది పాపాలను కడిగివేసేది అనే అర్థం చెప్పుకుంటారు. ఇక పది తలల రావణుడిని రాముడు ఈ రోజునే సంహరించిన కారణంగా ఈ పండుగకు ఈ పేరు వచ్చిందని అంటారు. పది రోజులపాటు జరిగే ఈ పండుగలో చివరి మూడు రోజులైన 'దుర్గాష్టమి' ... 'మహర్నవమి' ... 'విజయదశమి' మరింత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ మూడు రోజుల పాటు అమ్మవారిని పూజించడం వలన జ్ఞానం .... సంపద ... విజయం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కారణంగానే చివరి రోజైన విజయదశమి రోజున శమీ వృక్షం (జమ్మి చెట్టు ) లోని అపరాజితా దేవిని ఆరాధిస్తూ ''శమీ శమీయతే పాపం శమీ శత్రు వినాశనం ... అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీం'' అనే శ్లోకం చదువుతూ ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా చేయడం వలనే కౌరవులపై పాండవులు ... రావణుడి పై రాముడు విజయం సాధించారని అంటారు.
ఇక కొత్తగా వివాహమైన యువతులు తమ భర్తలతో కలిసి దసరా పండుగకు పుట్టినింటికి చేరుకుంటారు. దంపత సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఊరు ... ప్రతి వీధి కొత్త కళను సంతరించుకుని, సందడికి ... సంతోషాలకి వేదికగా నిలుస్తూ వుంటాయి.