భుసందేశ్వర్
పరమ శివుడి లీలలు అద్భుతాలు ... అనంతాలు ... ఆయన లీలా విన్యాసాలను గురించి చెప్పుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు. భక్తులకి అందుబాటులో ఉండటం కోసం రాయినే ఎంచుకుని ... రామ చంద్రుడితోనే ప్రతిష్ఠలు చేయించిన ఆయన లీలలు మహోన్నతాలు. లింగ రూపంలో అనేక క్షేత్రాలలో ఆయన వెలసినప్పటికీ, అవన్నీ ప్రత్యేకతలను సంతరించుకుని అలరారుతూనే వున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒరిస్సా - బాలాసోర్ జిల్లా - కుంభీర్ గాడి గ్రామం ఒకటి.
ఇక్కడి భక్తులు స్వామివారిని 'భుసందేశ్వరుడు' అని పిలుచుకుంటూ వుంటారు. ఒరియా భాషలో 'భుసంద' అంటే 'భారీ' లేదా పెద్దది అని అర్థం. 12 అడుగుల ఈ శివలింగం ... మహా శివుడి మనసులో నుంచి ఉద్భవించినట్టుగా కనిపిస్తుంది. శివలింగం ఆరు అడుగుల వరకే పైకి కనిపిస్తూ, మిగతాభాగం భూమిలో కూరుకుపోయి వుంటుంది. ఊరుకి కాస్త దూరంగా ఉన్న ఈ భారీ శివలింగాన్ని ఊరు మధ్యలో ప్రతిష్ఠించాలని ప్రాచీనా కాలం నుంచి ఎందరో ఎన్నో రకాలుగా ప్రయత్నించారట. అయితే అందుకోసం వాళ్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందులో ఏదో అంతరార్థం వుందని గ్రహించిన స్థానికులు ఇక ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఇక శివుడు ఆత్మలింగాన్ని రావణుడు తీసుకువెళుతుండగా, అతని ప్రయత్నానికి నారదుడు - వినాయకుడు అడ్డుతగిలిన పురాణ కథే ఈ క్షేత్రంలోను వినిపిస్తుంది. ఇందులో నిజానిజాల మాటెలా వున్నా శివలింగ దర్శనం సర్వపాప హరణమే కదా.