సప్తమాతృకల ఆవిర్భావం
బ్రహ్మణి' ... 'మహేశ్వరీ ' ... 'కౌమారి' ... 'వైష్ణవి' ... 'వారాహి' ... 'ఇంద్రాణి' ... 'చాముండి' దేవతలను సప్త మాతృకలు అంటారు. దేవీ పురాణం ... బ్రహ్మవైవర్త పురాణం ... స్కంద పురాణం ... సప్తమాతృకల ఆవిర్భావం గురించి వాటి విశిష్టతను గురించి పేర్కొన్నాయి.
పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరడంతో, వాడిని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు. అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ వుండగా ఆ రాక్షసుడి నుంచి చిందిన రక్త బిందువులు రాక్షసులుగా మారేవి. విషయాన్ని గ్రహించిన శివుడు ... మహేశ్వరిని రంగంలోకి దింపాడు. 'వృషభ' వాహనంపై ఆమె యుద్ధభూమిలోకి ప్రవేశించింది.
దాంతో బ్రహ్మ పంపిన బ్రహ్మణి 'హంస' వాహనంపై ... విష్ణుమూర్తి పంపిన వైష్ణవి 'గరుడ' వాహనం పై ... కుమార స్వామి పంపిన కౌమారీ 'నెమలి' వాహనం పై ... వరాహమూర్తి పంపిన వారాహి 'మహిష' వాహనం పై ... ఇంద్రుడు పంపిన ఇంద్రాణి 'ఐరావతం' పై ... యముడు పంపిన చాముండి 'శవ' వాహనం పై యుద్ధభూమికి చేరుకున్నాయి. ఈ శక్తి స్వరూపాల సాయంతో అంధకాసురుడిని శివుడు సంహరించాడు.
ప్రాచీన కాలంనాటి ఆలయాలను దర్శించినప్పుడు, సప్త మాతృకల ప్రతిమలను మలచడంలో వాళ్లు తీసుకున్న శ్రద్ధాసక్తులు స్పష్టమవుతాయి. ఒకే వరుసలో పద్మాసనంలో కూర్చున్నట్లుగా కనిపించే ఈ సప్త మాతృకలు ఆనాటి శిల్పకళా వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి.