పంచముఖ హనుమ
రామాయణంలో భుజబలాన్ని ... బుద్ధిబలాన్ని సందర్భోచితంగా ప్రదర్శించి శ్రీ రాముడి చేత ప్రశంసలు అందుకున్న హనుమంతుడు, ఆ కావ్యానికే ఆయువుపట్టుగా కనిపిస్తాడు. మహా శక్తి సంపన్నుడు అయినప్పటికీ అహంకారానికి దూరంగా ... అణకువకు ప్రతీకగా నిలిచాడు. హనుమలోని ఈ గుణమే అతనిని శ్రీరామచంద్రుడికి దగ్గర చేసింది. ప్రభుభక్తి పరాయణుడిగా ఆధ్యాత్మిక ప్రపంచాన అగ్రస్థానంలో నిలిచేలా చేసింది.
వైష్ణవులు ... శైవులు ... శాక్తేయులు అందరూ కూడా హనుమను ఆరాధిస్తూ వుండటం, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా కనిపిస్తుంది. హనుమ పేరు వినడానికే దుష్ట శక్తులు భయపడుతుంటాయి. అలాంటిది ఆయన పంచముఖ రూపాన్ని చూసే సాహసాన్ని అవి ఎప్పటికీ చేయలేవు. పంచముఖాలతో ... దశ హస్తాలతో సమస్త శక్తులకు కేంద్ర స్థానంగా కనిపించే హనుమ ... భక్తుల పాలిట బంగారుకొండ అని చెప్పొచ్చు.
సాధారణంగా హనుమ భక్తాంజనేయుడిగా ... వీరాంజనేయుడిగా ... ప్రసన్నాంజనేయుడిగా ... ధ్యానాంజనేయుడిగా ... భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి ఆంజనేయుడు నృసింహ ... గరుత్మంత ... వరాహ ... హయగ్రీవ ముఖాలతో దర్శనమిస్తుంటాడు.
'ధైర్యం' కోసం నిజరూపాన్ని ... 'కీర్తి' కోసం నృసింహ రూపాన్ని ... 'కార్యసాధన'కోసం గరుత్మంతుని రూపాన్ని ... 'ఆరోగ్యం'కోసం వరాహ రూపాన్ని ... 'జ్ఞానం' కోసం హయగ్రీవ రూపాన్ని భక్తులు కొలుస్తుంటారు. ఇలా ఒక్క పంచముఖ హనుమంతుని పూజించడం వలన ఇందరి అనుగ్రహాన్నిపొందే అవకాశం ... అదృష్టం లభించడమంటే మాటలా మరి.