శివ కటాక్షం
మంచుకొండల మధ్య వుండటం వల్లనేమో ... శివుడి మనసు మంచులా కరిగిపోతుంది. జగాలనేలే తల్లి అర్ధాంగి కావడం వల్లనేమో అడిగినదే తడవుగా ఆలోచించకుండా ఇచ్చేసే గుణం అబ్బింది. ఈ విషయంగా బోళాశంకరుడు అనే బిరుదు వచ్చినా ... ఇబ్బందులు ఎదురైనా భక్తులను చూడగానే ఆయన అన్నీ మరిచిపోయి మళ్ళీ మొదటికి వస్తాడు.
మారేడు దళం సమర్పిస్తే చాలు మహారాజును చేస్తాడు. చెంబెడు నీళ్లు అభిషేకంగా అర్పిస్తే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. ఇంతకన్నా మంచిదేవుడు ఎక్కడుంటాడు? కంఠంలో విషాన్ని ... కడుపులో వెన్నని దాచుకున్న మహా శివుడుని మనసు కాకుండా మరేది బంధించగలదు? అందుకే పురాణాలు మహా శివుడు మహోన్నత తత్వం గురించి ప్రస్తుతిస్తుంటాయి.
సదాశివుడు సృష్టిని ఉపసంహరించుకునే సమయంలో ఘోర రూపంలోనూ ... అనుగ్రహించే సమయంలో అఘోర రూపంలోను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాడు. పరమ శివుడిని అనేక విధాలుగా పూజిస్తూ పేరు పేరున ఆయనకు నమస్కారములు తెలియజెప్పడాన్ని 'నమకము' అని అంటారు. ఇక ఏదైతే పరమ శివుడి నుంచి ఆశించి ఫలానాది కావాలని కోరబడుతున్నదో దానిని 'చమకం' అని చెప్పబడుతోంది. అలాంటి నమక చమకాలతో రుద్రుడిని అభిషేకిస్తే ఈ జన్మ ధన్యమవుతుంది ... ముందుజన్మకు బదులుగా ముక్తి లభిస్తుంది.