సమస్త కోరికలను నెరవేర్చే హనుమ ఆరాధన

సాధారణంగా మనసులో కోరికలు లేని వారంటూ వుండరు. అవి ధర్మ బద్దమైన కోరికలే అయితే వాటికి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అవి నెరవేర్చమని భగవంతుడిని ప్రార్ధించవచ్చు .. ఆయనకి ప్రీతికరమైన సేవలు చేయవచ్చు. జీవితంలో విద్యా .. ఉద్యోగం .. వివాహం .. సౌభాగ్యం .. సంతానం .. సంపద .. ఆరోగ్యం .. ఆయుష్షు అనేవి అందరూ ఆశించేవే. ఈ కోరికలు నెరవేరడానికి ఎవరి ఇష్ట దైవానికి వాళ్లు నిత్య పూజలు చేస్తుంటారు .. ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పిస్తూ ప్రార్ధిస్తుంటారు.

హనుమ ఆరాధన వలన కూడా మనసులోని కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హనుమంతుడిని పూజించడం వలన శని .. కుజ దోషాలు తొలగిపోతాయి. బియ్యం .. గోధుమలు .. పెసలు .. మినుములు .. నువ్వుల పిండితో తయారు చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించి, హనుమను స్మరించుకుంటూ ఆ దీపాన్ని దానం ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన  మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయి. హనుమ ప్రతిమ ముందు దీపదానం చేయడం వలన, వ్యాధులు .. గ్రహ బాధలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.         


More Bhakti News