అయోధ్యలో రామ్ లల్లాను దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
- జై శ్రీరాం నినాదాల నడుమ విగ్రహానికి మొక్కులు
- శ్రీరాముని దర్శనం గర్వకారణమని వ్యాఖ్య
- వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేసిన కేరళ రాజ్ భవన్ కార్యాలయం
దర్శనం అనంతరం కేరళ గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ‘జనవరిలో రెండుసార్లు అయోధ్యకు వచ్చాను. ఆ రోజు కలిగిన భావనే ఈ రోజు కూడా కలిగింది. నేను ఎన్నోసార్లు అయోధ్యకు వచ్చాను. అయోధ్య వచ్చి శ్రీరాముడిని దర్శించుకోవడం కేవలం సంతోషకరమే కాదు.. గర్వకారణం కూడా’ అని ఆయన పేర్కొన్నారు.