సూర్యారాధన

సూర్యారాధన
సూర్యుడు ప్రత్యక్ష దైవం ... సకల ప్రాణకోటికి ఆయనే ఆధారం. సమస్త జీవుల చైతన్యం ఆయన పైనే ఆధారపడి వుంది. వెయ్యి కిరణములు కలిగిన వాడిగా సూర్యుడిని పేర్కొంటారు. ఇక ఈ వెయ్యి కిరణాల్లో ఏడు కిరణాలు విశిష్టమైనవిగా చెబుతారు. అవి 'సుషుమ్న' ... ' హరికేశం' ... 'విశ్వకర్మ' ... 'విశ్వ వ్యచ' ... 'సంపద్వసు' ... 'అర్వాగ్వం' ... 'స్వరాడ్వసు' అనే పేర్లతో పురాణాల్లో కనిపిస్తాయి. ఈ కిరణాలతో ప్రాణ కోటిని వ్యాధుల బారి నుంచి కాపాడటమే కాకుండా, కోరిన వరాలను ప్రసాదించే దైవంగా సూర్య నారాయణమూర్తిని వేదశాస్త్రాలు కొనియాడుతున్నాయి. సూర్యారాధనలోని విశిష్టతను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి.

పురాణ పురుషులుగా ... అవతార మూర్తులుగా చెప్పబడుతోన్న వారందరూ సూర్యుడిని ఆరాధించారు. ఇక వశిష్ఠ ... విశ్వామిత్ర ... భరద్వాజ ... గౌతమ .. దూర్వాస మహర్షులు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని ఆరాధించారు. సూర్య మండలం గురించిన విషయాలను ... ఉపాసనా విశేషాలను ... ఆరాధనా మార్గాలను ప్రపంచానికి అందించారు.

More Bhakti Articles