కుమారీ పూజ
రెండు సంవత్సరముల మొదలు పది సంవత్సరములలోపు పిల్లలను దేవికి ప్రతి రూపంగా భావించి 'కుమారీ పూజ' చేస్తుంటారు. దేవీ నవరాత్రులలో అమ్మవారు ధరించే వివిధ రూపాలకు ప్రతీకగా బాలికలకు ఈ పూజను నిర్వహిస్తుంటారు. ఈ పూజలో పాల్గొనే పిల్లలు అందంగా ... ఆరోగ్యంగా ఉండాలి. పద్ధతిగా ... పవిత్రంగా నడచుకునే కుటుంబాలకి చెందినవారై వుండాలి.
ఈ పూజ ప్రకారం ... రెండు సంవత్సరముల వయసుగల ఆడ పిల్లలను 'కుమారీ'గా ... మూడు సంవత్సరాలు గల పిల్లలను 'త్రిమూర్తి'గా భావిస్తుంటారు. నాలుగు సంవత్సరములు గల పిల్లలను 'కల్యాణి'గా ... అయిదు సంవత్సరాలు గల పిల్లలను 'రోహిణి'గా పిలుస్తుంటారు. ఆరు సంవత్సరాలు గల పిల్లలను 'కాళిక'గా ... ఏడూ సంవత్సరాలు గల పిల్లలను 'చండిక'గా కొలుస్తుంటారు. ఇక ఎనిమిది సంవత్సరాలు గల పిల్లలను 'శాంభవి'గా ... తొమ్మిది సంవత్సరాలు గల పిల్లలను 'దుర్గ'గా ... పది సంవత్సరాలు గల పిల్లలను 'సుభద్ర'గా పూజిస్తుంటారు.
ఇలా పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిది రోజుల పాటు, ప్రతి రోజు తొమ్మిది మంది పిల్లలను ఆయా స్థానాల్లో ఆహ్వానించి పూజిస్తుంటారు. 'కుమారీ'ని పూజించడం వలన జయం ... 'త్రిమూర్తి' వలన వంశాభివృద్ధి ... 'కల్యాణి' వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. ఇక 'రోహిణి'ని పూజించినందువలన రోగాలు ... 'కాళిక' వలన శత్రువర్గాలు నశిస్తాయి. 'చండిక'ను పూజించడం వలన సంపదలు ... 'శాంభవి' వలన లాభాలు ... 'దుర్గ' వలన విజయాలు ... 'సుభద్ర' వలన కోరినవి లభిస్తాయని 'దేవీభాగవతం' చెబుతోంది.