పవిత్ర స్నానాలు

పవిత్ర స్నానాలు
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు ... సముద్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. కార్తీక మాసంలోను ... పుష్కారాల సమయంలోను నదీ స్నానాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో సముద్ర స్నానాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదనే నియమం కనిపిస్తోంది. అలాగే నదుల్లో కూడా స్నానం చేయునప్పుడు పాటించవలసిన నియమాలను కూడా శాస్త్రం చెబుతోంది.

రాత్రి ధరించిన వస్త్రాలతో నదులలో గానీ ... సముద్రాలలో గాని స్నానం చేయకూడదు. ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించిన తరువాతే స్నానం చేయవలసి వుంటుంది. స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ ... పిండటంగాని చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు. శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు తలకెత్తుకోవలసి వస్తుందనే విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు.

More Bhakti Articles