ఇంట్లో శివలింగం

ఇంట్లో శివలింగం
సాధారణంగా తీర్థ యాత్రలకి వెళ్లినప్పుడు అక్కడి దుకాణాల్లో కొలువు దీరిన దేవుడి ప్రతిమలను చూడగానే వెంటనే వాటిని కొనాలనిపిస్తుంది. ఇక శివలింగం ... నంది వంటి విగ్రహాలు చూడగానే వెంటనే ఆకర్షిస్తాయి. పాలరాయితో ... నల్లరాయితో ... స్పటికంతో చేసే ఈ శివలింగాలు, చూడటానికి ముద్దుగా ... ముచ్చటగా కనిపిస్తుంటాయి. దాంతో పూజామందిరంలో పెట్టుకోవచ్చనే ఉద్దేశంతో వాటిని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంటారు.

అలాంటి పరిస్థితుల్లో ... శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవరైనా అనగానే వాళ్ల ఆశలపై నీళ్లు చల్లినట్టు అవుతుంది. శివలింగాన్ని ఇంట్లో వుంచడం అపచారంగా భావించి, వెంటనే దగ్గరలోని గుడికి వెళ్లి దానిని అక్కడ పెట్టేసి వచ్చేస్తుంటారు. అయితే అంతా అనుకున్నట్టు శివలింగం ఇంట్లో వుంచి పూజించుకోవడం ఏ రకంగాను అపచారం కాదు.

శివలింగం పూజా మందిరంలో పెట్టుకున్నప్పుడు, ప్రతినిత్యం అభిషేకం ... ధూప దీప నైవేద్యాలు ఉండాలి. నియమ నిష్టలను కూడా పాటించవలసి ఉంటుంది. ఇవన్నీ చేయగలిగితే శివలింగాన్ని ఇంట్లో పెట్టి చక్కగా పూజించుకోవచ్చు. లేదంటే నిత్య పూజలు జరిగే దేవాలయాల్లో గానీ ... శివ భక్తులకు గాని దానిని ఇచ్చివేయడమే అన్ని విధాల మంచిది.

More Bhakti Articles