సాయిబాబా మహాత్మ్యం అలాంటిది !

సాయిబాబా మహాత్మ్యం అలాంటిది !
శిరిడీ సాయిబాబా అంటే భక్తులకు అనంతమైన అనురాగం .. అపారమైన విశ్వాసం. ఆయన కొలువుదీరిన ఆలయాలు అందుకు నిదర్శనంగా దర్శనమిస్తుంటాయి. తనని విశ్వసించేవాళ్లని ఎన్నివిధాలుగా కాపాడాలో ... అన్నివిధాలుగా కాపాడుతూ వచ్చినవాడాయన. తన భక్తులు ఆ బాధలను భరించలేరని భావించినప్పుడు ఆ బాధలను తాను స్వీకరించిన సందర్భాలు ఎన్నోవున్నాయి.

ఎలాంటి కష్టమైనా ... ఎంతటి సమస్య అయినా బాబాతో చెప్పుకుంటే తీరిపోతుందనే విశ్వాసం నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే గురువారం వచ్చిందంటే చాలు ఆయన ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తుంటాయి. సాధారణంగా బాబాకి భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆయన పాదాల చెంత శిరస్సును వంచి నమస్కరిస్తుంటారు. ఆయన విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తుంటారు.

గురువు యొక్క పాదాలను ఆశ్రయించడం వలన సమస్త పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం లభిస్తుంది. ఆ పాదాలకు నమస్కరిస్తూ ప్రదక్షిణలు చేయడం వలన సమస్త దేవతలకు నమస్కరించిన ఫలితం దక్కుతుంది. ఆయన అనుగ్రహానికి ప్రతీకగా చెప్పబడే విభూతి ధారణ అన్నింటి నుంచి కాపాడుతూ వుంటుంది. ఇక తన సన్నిధిలో అడుగుపెట్టినవారిని బాబా చిరునవ్వుతో పలకరించకుండా .. అనుగ్రహించకుండా వుండడు.

బాబాకి ప్రదక్షిణలు చేయడం వలన ... ఆయన పాదాలకు నమస్కరించడం వలన ... విభూతి ధారణం వలన బాధలన్నీ తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఆయన ఆశీస్సుల వలన ఆనందకరమైన జీవితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. అందుకే బాబా కొలువైన ప్రతి మందిరం మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles