తిథులు - పూజలు

తిథులు - పూజలు
దేవుడు ఒక్కడే అయినా ఆయనని మనం అనేక రూపాలలో పూజించుకుంటూ వున్నాం. అడిగేవాడు ఆపదలో వున్నప్పుడు దేవుడు వారం - వర్జ్యం అనేవాటి గురించి పట్టించుకోడనే విషయం కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తూనే వుంది. ఇక మిగతా సమయాల్లో తిథులెరిగి ఆయా జన్మతిథులుగల దైవాలను పూజించడం వలన కోరుకున్న వాటిని పొందవచ్చని శాస్త్రం చెబుతోంది.

ఆ ప్రకారం చూస్తే ... 'పాడ్యమి' రోజున అగ్నిదేవుడునీ ... 'విదియ' రోజున అశ్వినీ దేవతలను ... 'తదియ' రోజున గౌరీదేవిని ... చతుర్దశి రోజున 'వినాయకుడినీ ... 'పంచమిరోజున' నాగదేవతను ... షష్ఠి రోజున కుమార స్వామిని .. సప్తమి రోజున సూర్య భగవానుడిని ... అష్టమి రోజున దుర్గాదేవిని ... నవమి రోజున దుర్గాదేవికి ఉపాసనతో కూడిన పూజని నిర్వహించాలి.

ఇక దశమి రోజున దిక్పాలకులను ... ఏకాదశి - ద్వాదశి రోజుల్లో శ్రీ మహావిష్ణువును పూజించాలి. త్రయోదశి రోజున ఇష్ట దేవతారాధన ... చతుర్దశి రోజున రుద్రాభిషేకం చేయాలి. అమావాస్య రోజున పితృ దేవతారాధన ... పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటూ చేసిన ఫలితాలు తప్పకుండా ఫలవంతమవుతాయని తెలుస్తోంది. కాబట్టి ఈ నియమం తప్పకుండా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే, ఆశించినవి అడగకుండానే చేతికి అందుతాయని స్పష్టమవుతోంది.

More Bhakti Articles