చూపుడు వ్రేలు
పూజలు ... నోములు ... వ్రతాలు ... మొదలైనవి నిర్వహించేటప్పుడు చూపుడు వ్రేలు ఉపయోగించకూడదనే నియమం వుంది. తెలిసీ తెలియక పూజాది కార్యక్రమాల్లో చూపుడు వ్రేలు ఉపయోగిస్తుండగా పెద్దలు చూస్తే వెంటనే మందలిస్తూ వుంటారు. పెద్దలను ... గురువులను ... దేవాలయాలను సైతం చూపుడు వ్రేలుతో చూపించకూడదని శాస్త్రం చెబుతోంది.
సాధారణంగా ఏ విషయం గురించైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గానీ ... రెండు వర్గాల మధ్య గాని గొడవ జరిగినప్పుడు ఒకరినొకరు చూపుడు వ్రేలు చూపిస్తూ దూషించుకుంటూ వుంటారు. పగ ... ప్రతీకారం ... ద్వేషం మొదలైనవాటిని చూపుడు వ్రేలుతోనే వ్యక్తం చేయడం జరుగుతూ వుంటుంది. చూపుడు వ్రేలును ఆవేశానికి ... అహంకారానికి సంకేతంగా ఉపయోగిస్తుంటారు. అందువల్ల ఆ వ్రేలును దైవ సంబంధమైన కార్యక్రమాలకి ... శుభకార్యాలకి వాడకూడదని అంటారు. తమలపాకుల్లో సున్నం చూపుడు వ్రేలుతో రాయకపోవడానికి ... గంధాన్ని చూపుడు వ్రేలుతో పూయక పోవడానికి కారణం కూడా ఇదే!