షోడశోపచారాలు
షోడశోపచారాలు అనగా 16 రకముల ఉపచారాలు అని అర్థం. మన ఇంటికి ముఖ్యమైన అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఎంతగా గౌరవించి ఎలాంటి మర్యాదలు చేస్తామో, శక్తిని ... భుక్తిని ... ముక్తిని ప్రసాదించే ఆ దైవం పట్ల అంతకన్నా ఎక్కువ భక్తి శ్రద్ధలు కలిగి వుండాలని పెద్దలు చెబుతుంటారు. దైవం మనసు గెలుచుకోవడానికి ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి 16 రకాల ఉపచారాలను పాటించాలని శాస్త్రం చెబుతోంది.
ఆవాహనము ... ఆసనము ... పాద్యము ... అర్ఘ్యం ... ఆచమనం ... స్నానం ... వస్త్రం ... యజ్ఞోపవీతం ... గంధం ... పుష్పం ... ధూపం ... దీపం ... నైవేద్యం ... తాంబూలం ... నమస్కారం ... ప్రదక్షిణం ... ఇలా 16 రకాలైన పూజాంగములతో దైవాన్ని సంతృప్తి పరచవలసి వుంటుంది. పవిత్రమైన ప్రదేశంలో ... నిర్మలమైన మనసుతో 16 ఉపచారాలతో దైవాన్ని పూజించినట్టయితే శతకోటి పుణ్య ఫలాలను అందుకోవచ్చు.