సూర్యగ్రహణం
గ్రహణాలలో సూర్య గ్రహణం చాలా ప్రమాదకరమైనదనే భావన పూర్వకాలం నుంచీ వుంది. సూర్య గ్రహణం సమయంలో బయటికి రాకూడదనీ ... కొన్ని రాశుల వారు చూడకూడదని అంటుంటారు. ఇక ఈ సమయంలో గర్భవతులను గదిలో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గ్రహణ సమయానికి ముందు గానీ ... ఆ వెంటనే గాని ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం, స్నానం చేసిన తరువాతనే వంట ఏర్పాట్లు చేయడం ఆచారంగా వస్తోంది.
సూర్య గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి కొన్ని హానికరమైన కిరణాలు వెలువడతాయనీ, అవి అనారోగ్యానికి గురిచేస్తాయని పూర్వీకులు గ్రహించారు. ఈ కిరణాలు గర్భవతులపై పడటం వలన వారి సంతానంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని గుర్తించారు. ఇక పరిశోధనల్లో సైతం కూడా గ్రహణ సమయంలో వెలువడే సూర్య కిరణాలు, గర్భంలోని శిశువుల కండరాలపై ... ఎముకలపై ... కంటి చూపుపై ప్రభావం చూపుతాయని తేలింది. జంతువుల్లోను ఇదే విధంగా జరగడం ఈ పరిశోధనలకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఈ విషయాన్ని పూర్వమే గుర్తించిన పెద్దవాళ్లు గ్రహణ సమయంలో ఆయా పదార్థాలు విష పూరితం కాకుండా వాటిపై దర్భలను ఉంచుతూ వచ్చారు. ఆధునిక కాలంలోనూ ఇదే పద్ధతిని ... ఆచారాన్ని కొనసాగిస్తూ వుండటం విశేషంగానే చెప్పుకోవాలి.