తోరము
పూజలు ... నోములు ... వ్రతాల సమయంలో తొమ్మిది వరుసలు గల తోరము(సూత్రము)ను చేతికి కట్టుకోవడమనేది ఒక నియమంగా వస్తోంది. సంకల్ప బలంతో కంకణబద్ధులై పూజను నిర్వహిస్తున్నామనడానికి గుర్తుగా ఈ తోరమును ధరించడం జరుగుతుంది.
అయితే కొంతమంది పూజా కార్యక్రమం పూర్తి కాగానే అసలు ఆ తోరం తమ చేతికి ఉన్నదో ... ఊడిపోయిందో కూడా పట్టించుకోరు. మరికొందరు ఇక దానితో పని లేదన్నట్టుగా ఆ తోరముని తీసి ఎక్కడపడితే అక్కడ పారేస్తుంటారు. వారి దృష్టిలో ఆ తోరానికి దైవత్వం గానీ ... పవిత్రత గాని లేకపోవడం వల్లనే ఈ విధంగా చేస్తుంటారు. అయితే పూజకు ఉపయోగించబడిన తోరము లక్ష్మీదేవి నివాస స్థానమనీ ... దానిని అపవిత్రం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూజ పూర్తి కాగానే తోరమును తీసిపారేయడమంటే అది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని అవమానపరిచినట్టేనని చెబుతుంటారు.
పూజ పూర్తి అయిన తరువాత ఈ తోరమును భద్రంగా ఏదైనా పెట్టెలో దాచాలి. పూజ చేయబడిన తోరము పట్ల పవిత్రమైన భావం లేని కారణంగానే నలమహారాజు దంపతులు నానా ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. ఇక ఇదే విషయం అనంతపద్మనాభ స్వామి వ్రత కథలోనూ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అత్యంత పవిత్రమైన తోరమును బహు జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని గ్రహించినట్టయితే, పుణ్యకార్యం ఫలించినట్టే అవుతుంది.