వడ్డాణం
సాధారణంగా స్త్రీలు ధరించే ఆభరణాల్లో 'వడ్డాణం' ప్రముఖమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. వడ్డాణం ధరించడానికి స్త్రీలు ఎంతో ఆసక్తిని కనబరుస్తూ వుంటారు. అయితే వడ్డాణం ధరించడం ఒక అలంకరణగా ... హోదాగా చాలా మంది భావిస్తుంటారు. నిజానికి వడ్డాణం ధరించడం వలన అనేక ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి.
గర్భవతులైన స్త్రీలు వడ్డాణం ధరించడం వలన నడుము భాగం లావెక్కకుండా వుంటుంది. గర్భకోశం లోపలిభాగం మందంగా మారి శిశువు ఎదుగుదలను అడ్డుకోకుండా చేస్తుంది. శరీరంపై ధరించే ఆభరణాలు లోపల ఎలాంటి ప్రభావం చూపలేవని కొందరు సందేహిస్తుంటారు. కానీ నిజంగానే లోహంతో చేయబడిన ఆభరణాల మూలంగా శరీరంపైనే కాకుండా లోపల కూడా అవి ప్రభావం చూపుతాయని అధ్యయన పూర్వకంగా తేలింది.
రాగి చెంబులో నిల్వచేసిన నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిదని తెలిసి చాలామంది దానిని పాటిస్తున్నారు. వడ్డాణం ధరించడం వలన కలిగే ప్రయోజనం కూడా అటువంటిదేనని చెప్పవచ్చు. విచారించదగిన విషయమేమిటంటే ... ఈ కాలంలో వడ్డాణం ధరించే వారి సంఖ్య చాలా వరకూ తగ్గిపోయింది. వైద్య విధానంలో ఆధునిక సౌకర్యాలు పెరిగిపోయినప్పటికీ, శిశువులు ఆరోగ్యంగా లేకపోవడానికి గల కారణం ఆచారాలను మూఢ నమ్మకాల జాబితాలోకి చేర్చడమేనని చెప్పక తప్పదు.