గౌరీ పూజ

గౌరీ పూజ
వివాహమనగానే అటు వరుడి ఇంట్లోను ... ఇటు వధువు ఇంట్లోను అందుకు సంబంధించిన ఏర్పాట్లు సందడిగా జరుగుతుంటాయి. ఇక వివాహ వేదిక చేరుకునేలోగా వధూ వరులకు వారి వారి ఇళ్లలోనే కొన్ని పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వధువుకు 'మంగళ స్నానం' చేయించి పూలతోను ... ఆభరణాలతోను అందంగా ముస్తాబు చేసి 'గౌరీ పూజ' చేయిస్తారు.

అలాగే అక్కడ అబ్బాయికి కూడా మంగళస్నానం చేయించి ... స్నాతకం పూర్తి చేస్తారు. వరుడు తనకి సంసార వ్యామోహం లేదని చెప్పి కాశీ యాత్రకు బయలుదేరుతుంటే, వధువు సోదరుడు బతిమాలి వెనక్కి తీసుకు వస్తాడు. అనాదిగా వస్తోన్న ఈ ఆచారం వెనుక ఆరోగ్యపరమైన ... ఆధ్యాత్మిక పరమైన అర్థం లేకపోలేదు.

నిత్య సుమంగళి ... జగజ్జనని అయిన అమ్మవారిని తనకి సంతాన సౌభాగ్యాలను ఇవ్వమని కోరుతూ పెళ్లి కూతురుతో గౌరీపూజ చేయిస్తారు. సాక్షాత్తు ఆదిదేవుడైన పరమేశ్వరుడి జీవితమే, పార్వతీ దేవిని వివాహమాడిన కారణంగా పరిపూర్ణతను సంతరించుకుంది. కాబట్టి అర్థాంగి సహాయ సహకారాలతోనే జీవన సాఫల్యం కలుగుతుందనే సందేశాన్ని ఈ ఘట్టం చెప్పకనే చెబుతోంది.

More Bhakti Articles