శివుడి పూలు
సాధారణంగా దైవదర్శనానికి అనగానే పూల దుకాణానికి వెళ్లి అక్కడ అందుబాటులో వున్న పూలు తీసుకుని హడావిడిగా గుడికి వెళ్లిపోతుంటారు. అయితే దైవానికి ఇష్టమైన పూలు సమర్పించినప్పుడు ఫలితం వెంటనే లభిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు. ఏ దైవానికి ఏ పూలు తీసుకు వెళ్లాలనే నియమం ఒకటుందనే విషయం తెలుసుకుంటే ఆ ప్రకారం వాటిని తీసుకుని వెళ్లొచ్చు.
వైష్ణవ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎర్ర తామర ... తెల్ల తామర ... చామంతి ... మల్లెలు ... సంపెంగలు తీసుకువెళ్లవలసి వుంటుంది. ఇక శక్తి దేవతలకి కలువలు ... మొల్లలు ... మందారాలు సమర్పించవలసి వుంటుంది. శివుడికి గన్నేరు ... చంపకములు ... ఎర్ర మందారాలు ... తెల్ల తామరలు ... పొగడలు ... నల్ల కలువలు తీసుకు వెళ్లవలసి వుంటుంది.
ఇక వేయి గన్నేరు పూలకన్నా ఒక మారేడు దళము ... వేయి తామరపూల కన్నా ఒక పొగడపూవు ... వేయి జమ్మిపూలకన్నా ఒక నల్లకలువ శ్రేష్టమైనవని శాస్త్రం చెబుతోంది. ఈ పూలలో ఒక్కోరకం పూవు ఒక్కో ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది. అయితే ఒక్కొక్క పూవుతో శివుడిని పూజించేటప్పుడు ఆ పూలు బోర్లా పడకుండా చూసుకోవాలనీ, అదే దోసిళ్లతో పూలు తీసుకుని పూజించేటప్పుడు ఈ దోషం వర్తించదని అంటారు.
ఉమ్మెత్తలు ... కడిమిపూలు ... మల్లెలు శివుడికి రాత్రి వేళ మాత్రమే సమర్పించాలనే నియమం వుంది. అలాగే జాజిపూలతో మూడవ జామున ... గన్నేరులతో ఏ సమయంలోనైనా శివుడిని పూజించ వచ్చని తెలుస్తోంది. ఇక మొల్ల పూవులతో పూజించడం వలన సంతానం ... జిల్లేడు పూలతో పూజించడం వలన సంపదలు ... ఉమ్మెత్త పూలతో పూజించడం వలన మోక్షం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.