ఉపచార దోషాలు

ఉపచార దోషాలు
దైవానుగ్రహం ఎల్లవేళలా ఉండాలనే ఉద్దేశంతోనే పూజలు ... నోములు ... వ్రతాలు ... చేస్తుంటారు. సాధారణంగా పూజలు నిర్వహించేటప్పుడు తెలిసీ తెలియక అపచారాలు ఏమైనా చేస్తున్నామా అని కొందరు ఆందోళన చెందుతుంటారు. మరికొందరు ఈ విషయాలను గురించి పెద్దగా పట్టించుకోరు. పూజ నిష్టగా చేయకపోవడం వలన ... ఉపచారాల నిర్వహణలో సరైన శ్రద్ధ తీసుకోక పోవడాన్ని వాళ్లు పెద్ద పొరపాటుగా భావించరు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలనుకుని చాలా తేలికగా తీసుకుంటూ వుంటారు.

అయితే అశ్రద్ధతో చేసే పూజల వలన పుణ్యానికి బదులు పాపాన్ని మూటగట్టుకోవలసి వస్తుందని గ్రహించాలి. పూజలో మంత్రలోపం కారణంగా మరణం ... క్రియా దోషం వలన వ్యాధులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఇక పువ్వులు సమర్పించక పోవడం వలన శత్రు భయం ... గంధం సమర్పించక పోవడం వలన దరిద్రం కలుగుతాయని చెబుతోంది. దీపారాధన విషయంలో లోపం కారణంగా మతి భ్రమించడం ... ధూపం వెలిగించని కారణంగా రోగాలబారినపడటం జరుగుతుందని తెలుస్తోంది.

కాబట్టి సిరి సంపదలు ... సుఖ సంతోషాలను ఇచ్చే దైవం విషయంలోనూ, ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించే పూజల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

More Bhakti Articles