చెవులు కుట్టించడం

చెవులు కుట్టించడం
ఆడపిల్లలకు చెవులు కుట్టించడం మన ఆచార సంప్రదాయాల్లో ఒక భాగంగా వస్తోంది. ఆడపిల్ల జీవితంలో మేనమామ పాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. మేనమామ ఒళ్లో కూర్చోబెట్టి చెవులు కుట్టించడం జరుగుతూ వుంటుంది. ఇలా చెవులు కుట్టించడమనేది కేవలం అలంకారపరమైన ఉద్దేశమేనని కొందరు భావిస్తుంటారు. మరి కొందరు ఈ విధంగా చేయడం వలన కొత్తగా ఒరిగేదేమీలేదంటూ ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటారు.

అయితే ఆడపిల్లల విషయంలో ఆచారపరంగా వచ్చిన ఆభరణాలు ... అలంకరణల వెనుక అసలైన అర్థాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆచారం వెనుక కూడా ఆరోగ్య పరమైన అర్ధాలు లేకపోలేదు.

చెవులు కుట్టించడం అనేది 'ఆక్యుపంక్చర్'వైద్య విధానానికి సంబంధించిన అంశమని తెలుస్తోంది. చెవులు కుట్టించడం వలన చెవి సంబంధమైన వ్యాధుల బారినుంచి రక్షణ లభిస్తుంది. అంతే కాకుండా దృష్టి దోషాలు ... మూర్చలు ... రక్తపోటు ... ఆయాసం వంటి వ్యాధులకు దూరంగా ఉంచుతుందని వైద్య శాస్త్ర నిపుణులు నిర్ధారించారు. ఈ కారణంగానే పూర్వీకులు ఈ విధానాన్ని ఆచారాల పేరుతో తమ తరువాత తరాలవారికి పరిచయం చేశారనే విషయం స్పష్టమవుతోంది.

More Bhakti Articles