భోగిపండ్లు
తెలుగు పండుగలలో సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. భోగి ... సంక్రాంతి ... కనుమ అంటూ మూడు రోజులపాటు జరిగే పండుగ ఇది. మన సంస్కృతీ సంప్రదాయాలకు ఈ పండుగ అద్దం పడుతుంది. 'భోగి' రోజున చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయడమనే ఆచారం వుంది. ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి, చిన్న రేగిపళ్ళు ... శనగలు ... చిల్లర డబ్బులు ... పూలరేకులు కలిపి భోగిపండ్లు పోస్తుంటారు.
ముచ్చటగా మూడు సార్లు దిష్టి తీసినట్టుగా పిల్లల తలపై నుంచి తిప్పి ఈ భోగిపండ్లు పోస్తుంటారు. ఈ విధంగా చేయడమనే ఆచారం వెనుక పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అర్థం లేకపోలేదు. రేగుచెట్టుకి బదరీ వృక్షమనే పేరు వుంది. బదరీ క్షేత్ర వాసుడైన శ్రీ మన్నారాయణుడికి రేగుపండ్లు అంటే ఎంతో ఇష్టం. అలాంటి రేగుపండ్లను పిల్లల తలపై పోయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వాళ్లకి లభిస్తుందని తల్లిదండ్రులు భావిస్తారు.
ఇక రేగుపండ్లలో ఎన్నో దివ్య మైన ఔషధ గుణాలు వున్నాయి. రేగుపండ్లు తలపై నుంచి పోయడం వలన, అవి శరీరమంతా తాకుతూ కిందపడతాయి కనుక, చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇక రేగుపండ్లు తినడం వలన రక్తకణాల సంఖ్య పెరుగుతుంది ... మానసిక పరమైన ఒత్తిడి తగ్గుతుంది. రేగుపండు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఆకలినీ ... ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. రేగు పండ్లు పచ్చళ్లు ... వడియాలు పెట్టుకోవడంలోని ఉద్దేశం ఇదే. చూడటానికి సరదాగా ... సంతోషంగా అనిపించే భోగిపండ్ల వేడుక వెనుక ఇంతటి అర్థం దాగివుంది.