ధ్వజ స్తంభం
ప్రతి నిత్యం కాకపోయినా పండుగ రోజుల్లోనో ... పర్వదినాల్లోనో పూజలు చేయించడానికి దేవాలయానికి వెళుతూ వుంటాం. అయితే ముందుగా ప్రదక్షిణలు చేస్తాంగాని 'ధ్వజస్తంభం' గురించి పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతూ వుంటుంది. నిజానికి దేవాలయం దేహమైతే ధ్వజస్తంభం వెన్నెముక అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ప్రదక్షిణ సమయంలో తప్పనిసరిగా ధ్వజస్తంభానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి.
ధ్వజ స్తంభాన్ని బట్టే అది శివాలయమా? విష్ణు ఆలయమా? అనే విషయం తెలుసుకోవచ్చు. శివాలయపు ధ్వజస్తంభంపై 'త్రిశూలం'వుంటే, విష్ణాలయం ధ్వజస్తంభంపై 'చక్రం' కనిపిస్తూ వుంటుంది. ధ్వజ స్తంభం పొడవుగా ... ఎత్తుగా వుండటం వలన అక్కడ దేవాలయం ఉందనే విషయం ఊరికి దూరంగా వెళుతోన్న బాటసారులకు తెలుస్తుంది. దేవాలయంలో ఆయా దైవాలకు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు, ఆకాశ మార్గంలో ప్రయాణించే దేవతలకు ధ్వజస్తంభం ద్వారానే ఆ విషయం తెలియజేయబడుతుంది.
శక్తిమంతమైన మంత్రాలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది ... దైవానికి ఎదురుగా ఉండి నిరంతరం ఆయన దృష్టిని స్వీకరిస్తూ వుంటుంది కాబట్టి అది ఎంతో పవిత్రమై వుంటుంది. ఈ కారణంగానే ధ్వజ స్తంభ స్పర్శతోనే పాపాలు పటాపంచలై పోతాయని చెబుతుంటారు. కాబట్టి ధ్వజస్తంభానికి నమస్కరించడం ఎట్టి పరిస్థితుల్లోను మరిచిపోకూడదు.