దేవాలయ వృక్షాలు
రాయిని ... చెట్టుని కూడా దైవంగా భావించి పూజించే సంప్రదాయం మనది. ఈ కారణంగానే రావిచెట్టును పురుషుడుగాను ... వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. సాధారణంగా ఈ రెండు వృక్షాలు కలిసి గానీ ... విడివిడిగా గానీ దేవాలయ ప్రాంగణంలో మనకి కనిపిస్తూ వుంటాయి.
రావిచెట్టును విష్ణు స్వరూపంగాను ... వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దాంపత్య పరమైన దోషాలు నివారించబడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 'పద్మపురాణం'... 'స్కంద పురాణం' కూడా రావిచెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని చెబుతున్నాయి.
ఇక రావిచెట్టు కింద సేద దీరడం వలన శని కారణంగా సంక్రమించిన దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా మనసుకి ప్రశాంతత కలిగి రక్తపోటుకి సంబందించిన వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది. గౌతమబుద్ధుడు జ్ఞానాన్ని పొందినది ... శ్రీ కృష్ణుడు తన అవతారాన్ని చాలించినది ఈ చెట్టుకిందనే.
ఇక రావిచెట్టుతో కలిసి పూజలందుకునే వేపచెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగివుంటుంది. వేప ఆకులను నీళ్లలో వేసి కాచి ... ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇక వేపచెట్టు పై నుంచి వచ్చే గాలి కూడా క్రిమిసంహారిగా పనిచేస్తుంది. ఇలా ఈ రెండు వృక్షాలు ఇటు ఆధ్యాత్మిక పరంగాను ... అటు ఆరోగ్యపరంగాను మానవ మనుగడకు ఎంతో మేలుచేస్తున్నాయి కనుకనే దేవాలయ వృక్షాలుగా పూజలు అందుకుంటున్నాయి.