చెన్నై స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ధోనీ పేరెంట్స్... ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడంటూ వార్తలు!

  • మరోసారి ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క‌థ‌నాలు
  • ఇవాళ డీసీతో మ్యాచ్ త‌ర్వాత ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం అంటూ క‌థ‌నాలు
  • ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తున్న మ‌హీ త‌ల్లిదండ్రులు  
  • ఇదే అంశం ఈ వార్త‌ల‌కు బలం చేకూరుస్తోన్న వైనం
చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ సార‌థి, స్టార్ ప్లేయ‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్‌డీ) ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో జ‌రుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జ‌రుగుతున్న మ్యాచ్ త‌ర్వాత ఎంఎస్‌డీ రిటైర్మెంట్‌పై ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లు క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. 

ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో జ‌రుగుతున్న ఇవాళ్టి మ్యాచ్‌ను ధోనీ తండ్రి పాన్ సింగ్, త‌ల్లి దేవ‌కి దేవి ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తుండటం ఈ వార్త‌ల‌కు బలం చేకూరుస్తోంది. ఇలా మ‌హీ పేరెంట్స్ స్టేడియంలో ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్ వీక్షించ‌డానికి రావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఎంఎస్‌డీ అభిమానులతో పాటు క్రికెట్ వ‌ర్గాలు కూడా ఈ గేమ్ త‌ర్వాత ధోనీ ఏమైనా ప్ర‌క‌ట‌న చేస్తాడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.   


More Telugu News