: పాకిస్థాన్ సంతతి అమెరికా ఆటగాళ్లకు భారత్ వీసా నిరాకరణ.. అసలు విషయం ఏమిటంటే..!
- ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్
- నలుగురు ఆటగాళ్లకు వీసాల జారీలో జాప్యం
- జాబితాలో అలీఖాన్, జహంగీర్, మోహ్సిన్, ఆదిల్
- భారత ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందన్న అధికారులు
పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికా ఆటగాళ్లకు భారతదేశం వీసాను నిరాకరించిందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని సమాచారం. టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సంతతికి చెందిన నలుగురు అమెరికా ఆటగాళ్లకు భారత వీసాల జారీలో జాప్యం నెలకొంది. అలీఖాన్, జహంగీర్, మహ్మద్ మోహ్సిన్, ఆదిల్ ఈ జాబితాలో ఉన్నారు.
భారత్ తన వీసా నిరాకరించిందనే అర్థం వచ్చేలా అలీఖాన్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. ఇది చర్చకు దారి తీసింది. అయితే వీసాలను నిరాకరించలేదని, ఇంకా జారీ ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా జట్టు కొలంబోలో ఉంది. మిగతా సభ్యుల వీసా ప్రక్రియ అక్కడి భారత హైకమిషన్ ఆధ్వర్యంలో ముగిసినప్పటికీ, పాకిస్థాన్ సంతతికి చెందిన ఆటగాళ్ల వీసాల జారీలో మాత్రం జాప్యం నెలకొంది.
ఆ నలుగురు ఆటగాళ్లు భారత రాయబార కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తీసుకున్నారని, ఈ దశలో వీసాలను ప్రాసెస్ చేయలేమని ఆ ఆటగాళ్లకు సమాచారం అందిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అమెరికా మేనేజ్‌మెంట్‌కు భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. అవసరమైన సమాచారంలో కొంత అందిందని, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా అదనపు సమాచారం రావాల్సి ఉందని వెల్లడించారు.
ఈ అంశంపై భారత సంబంధిత అధికారులు కూడా స్పందించారు. పాకిస్థాన్ మూలాలున్న ఆటగాళ్లకు సంబంధించిన వీసాల జారీ ప్రక్రియ ప్రత్యేక కేటగిరీ కింద భారత ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందని అధికారులు తెలిపారు. గతంలో మొయిన్ అలీ, షోయబ్ బషీర్, ఉస్మాన్ ఖవాజా వంటి అంతర్జాతీయ క్రికెటర్ల వీసాలకు సంబంధించి కూడా ఇలాంటి విధానాన్నే పాటించామని వారు వివరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తుది ఆమోదం అవసరమవుతుందని ఆ అధికారులు వెల్లడించారు.