Gold prices: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 14 రోజుల్లో రూ.52 వేలు పెరిగిన వెండి

Gold Silver Prices Surge in Future Market
  • ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కరోజే రూ.12 వేలకు పైగా పెరిగిన వెండి ధర
  • రూ.1.43 లక్షల వద్ద ట్రేడ్ అవుతున్న 10 గ్రాముల బంగారం ధర
  • స్పాట్ మార్కెట్‌లో రూ.1,47,600 వద్ద పసిడి ధర
ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరగాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఖరీదైన లోహాల ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఇరాన్‌లో పౌరుల ఆందోళనలు, ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం, వెండి ధరల పరుగుకు అనుకూలంగా మారాయి.

ఫ్యూచర్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఒక్కరోజే రూ.12 వేలకు పైగా పెరగగా, కొత్త సంవత్సరంలో రూ.52 వేలు పెరగడం విశేషం. ఫ్యూచర్ మార్కెట్‌లో కిలో వెండి ధర మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ఈరోజు రూ.12,803 పెరిగి రూ.2.87 లక్షలకు చేరుకుంది.

బంగారం 10 గ్రాములు రూ.1.43 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర నాలుగు రోజుల్లోనే రూ.35 వేలు పెరిగింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.2.35 లక్షలుగా ఉన్న వెండి ధర 2026లో రూ.52 వేలు పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఒక్కరోజులో రూ.932 పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుని సరి కొత్త రికార్డును నమోదు చేసింది.

స్పాట్ బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్పాట్ గోల్డ్ ధర రూ.1,47,600, 22 క్యారెట్ల పసిడి రూ.1,31,650గా నమోదయింది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,88,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రూ.4,638.75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి డాలర్ల 90 డాలర్ల ఎగువన కొనసాగుతోంది.
Gold prices
Silver prices
Future market
Hyderabad bullion market
Commodity market
Spot gold price

More Telugu News