లోక్‌స‌భ‌లో ప్రియాంక బుగ్గ‌లు నిమిరిన‌ రాహుల్ గాంధీపై స్పీక‌ర్‌ ఆగ్ర‌హం... ఇదిగో వీడియో!

 
లోక్‌స‌భ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్ర‌వ‌ర్త‌న‌పై స్పీక‌ర్ ఓంబిర్లా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంపీలంతా స‌భా మ‌ర్యాద‌ను పాటించాల్సిందేన‌ని అన్నారు. బుధ‌వారం నాడు స‌భ జరుగుతున్న స‌మ‌యంలో త‌న సోద‌రి ప్రియాంక గాంధీ వ‌ద్ద‌కు వ‌చ్చిన రాహుల్ గాంధీ ఆమె బుగ్గ‌లు నిమిరి ప‌ల‌క‌రించారు. 

ఈ విషయంపై స్పీక‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ స‌భ్యుల‌కు కీల‌క సూచ‌న చేశారు. "స‌భ‌లో ఎలా ప్ర‌వ‌ర్తించాలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. త‌ల్లీకూతుళ్లు, తండ్రీకూతుళ్లు, భార్యాభ‌ర్త‌లు, అన్నాచెల్లెళ్లు అయిన‌ప్ప‌టికీ త‌ప్ప‌కుండా అంద‌రూ సభా నియ‌మాలు పాటించాలి" అని ఓం బిర్లా పేర్కొన్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.   


More Telugu News