చెన్నైలో ఇళయరాజా నివాసానికి వెళ్లిన సీఎం స్టాలిన్

  • ఈ నెల 8న లండన్ లో ఇళయరాజా సింఫనీ
  • ఇళయరాజాను కలిసి స్వయంగా అభినందించిన సీఎం స్టాలిన్
  • ఇళయరాజాని ప్రపంచవ్యాప్త తమిళ ప్రజల సంగీత శ్వాస అని అభివర్ణన
సంగీత జ్ఞాని ఇళయరాజా మార్చి 8వ తేదీన లండన్ లో భారీ సింఫనీ నిర్వహించబోతున్నారు. ఆసియాకు చెందిన వారు గతంలో ఎవరూ సింఫనీ నిర్వహించిన దాఖలాలు లేవు. 

ఈ నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేడు చెన్నైలో ఇళయరాజా నివాసానికి వెళ్లారు. లండన్ లో భారీ ఆర్కెస్ట్రా ప్రదర్శనకు ధైర్యంగా ముందుకొచ్చారంటూ ఇళయరాజాను స్టాలిన్ అభినందించారు. ప్రపంచవ్యాప్త తమిళ ప్రజల సంగీత శ్వాస... ఇళయరాజా అని అభివర్ణించారు. ఈ సందర్భంగా స్టాలిన్... శాలువా కప్పి ఇళయరాజాను సత్కరించారు. 

ముఖ్యమంత్రి స్టాలిన్ తనను కలవడం పట్ల దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా సీఎం స్టాలిన్ తన నివాసానికి రావడం, కొంతసేపు తనతో ముచ్చటించడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. సంగీతం పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ అభిరుచి తనను ఆనందానికి గురిచేసిందని తెలిపారు.


More Telugu News