Revanth Reddy: రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ మంత్రి సమావేశం... తెలంగాణ సీఎంపై ప్రశంస

Himachal Pradesh Minister Meets Revanth Reddy Praises Telangana CM
  • రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలను వివరించిన ముఖ్యమంత్రి
  • జాతీయ విద్యా విధానం తరహాలో తెలంగాణ విద్యా విధానం తీసుకు రానున్నట్లు వెల్లడి
  • మల్లేపల్లి ఐటీసీని సందర్శించాలని హిమాచల్ మంత్రికి రేవంత్ రెడ్డి సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు వివరాలను హిమాచల్ ప్రదేశ్ మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.

25 ఎకరాల సువిశాల స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ తరహాలో రూ. 200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. జాతీయ విద్యా విధానం తరహాలో త్వరలో తెలంగాణ విద్యా విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మల్లేపల్లి ఐటీసీని సందర్శించాలని హిమాచల్ ప్రదేశ్ మంత్రికి ముఖ్యమంత్రి సూచించారు.

ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణంపై హిమాచల్ మంత్రి రోహిత్ ఠాకూర్ ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణి, పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విద్యా శాఖ ఉన్నతాధికారులకు రేవంత్ రెడ్డి సూచన

ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఆయన విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై చర్చ జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించాలని ఆదేశించారు. సోలార్ కిచెన్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. బడ్జెట్ కేటాయింపుల్లో యంగ్ ఇండియా స్కూళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
Revanth Reddy
Telangana CM
Himachal Pradesh
Rohit Kumar
Education System
Young India Integrated Residential Schools

More Telugu News