Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు

Uddhav Thackeray critical comments on PM Narendra Modi
  • మోదీని ప్రధానిగా చేయాలని 2014, 2019లో తిరిగానన్న ఉద్ధవ్ థాకరే
  • కానీ ఆయన నా పార్టీని విచ్ఛిన్నం చేశారని ఆరోపణ
  • బాల్ థాకరే ఉన్నంత కాలం బీజేపీ జాగ్రత్తగా ఉండేదన్న ఉద్ధవ్ థాకరే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలనే ఉద్దేశంతో తాను రెండుసార్లు ఆయన కోసం ప్రచారం చేస్తే, ఆయన మాత్రం ఇప్పుడు తనకు రాజకీయంగా ముగింపు పలకాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ, మోదీని ప్రధానిగా చేయడానికి తాను 2014, 2019లలో ప్రచారం చేశానని గుర్తు చేశారు. అయితే, ఆయన తన పార్టీని విచ్ఛిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు పర్యాయాలు ఆయన కోసం ప్రచారం చేసినందుకు తనకు బాధగా, కోపంగా ఉందని అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఎప్పటి నుంచో ఉందని ఆయన ఆరోపించారు.

బాలాసాహెబ్ థాకరే ప్రస్తుతం లేరని బీజేపీ భావిస్తోందని, అందుకే 'సేన'ను కాగితంపై వారు ముగించారని, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలా చేయలేరని అన్నారు. బాల్ థాకరే ఉన్నప్పుడు 2012 వరకు వాళ్లు జాగ్రత్తగా ఉండేవారని బీజేపీని ఉద్దేశించి అన్నారు.
Uddhav Thackeray
Narendra Modi
Shiv Sena
BJP
Maharashtra Politics
Mumbai
Balasaheb Thackeray

More Telugu News