గాంధీభవన్‌లో తీవ్రంగా కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు... ఇదిగో వీడియో

  • గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ సమావేశం
  • కాసేపటికే రసాభాసగా మారిన సమవేశం
  • ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ పలువురి ఆగ్రహం
  • రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న నాయకులు
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు పరుషపదజాలంతో తిట్టుకుంటూ... కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొంతమంది కలిసి... ఓ వ్యక్తిని తిడుతూ కొడుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈరోజు గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమైన కాసేపటికి రసాభాసగా మారింది. యూత్ కాంగ్రెస్ నేత‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోయారు. ఆ త‌ర్వాత రెండు ప‌క్షాలు బాహాబాహీకి దిగారు. పార్టీలో ప‌ద‌వుల కోసం ఇరువ‌ర్గాల నేత‌లు కొట్టుకున్నారు.

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నార‌ని కొత్త‌గూడెం కాంగ్రెస్ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం పని చేస్తున్న వారికి విలువ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వ‌ర్గాల వారు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఆ తర్వాత వాగ్వాదం కాస్త ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. కొట్టుకున్న ఇరువ‌ర్గాల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు.


More Telugu News