ఐటీ కొలువులు మీ చెంతకే: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విజయవాడ, గుంటూరు నగరాలను ఐటీ హబ్ లుగా మారుస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన విజయవాడలో పర్యటిస్తున్నారు. మహిళలపై పెరుగుతున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు వారి ఆత్మరక్షణ కోసం ఆడపిల్లలకు కరాటేలో శిక్షణ ఇప్పిస్తామని బాబు హామీ ఇచ్చారు.