చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్
Advertisement
- చెన్నైలో వైఎస్ కుటుంబ వివాహ వేడుకకు హాజరైన జగన్ దంపతులు
- నూతన వధూవరులు శ్రేయ-ఉజ్వల్‌ను ఆశీర్వదించిన రాజకీయ ప్రముఖులు
- వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీఎం విజయ్, నటి త్రిష
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి వేడుక ఫొటోలు
Advertisement
వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన అర్ధాంగి వైఎస్ భారతి చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుక పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల కలయికతో ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది.
వివరాల్లోకి వెళితే, జగన్ బంధువు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్‌తో చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ దంపతులు, వేదికపైకి వెళ్లి నూతన జంట శ్రేయ-ఉజ్వల్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందమయంగా, సుఖసంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుక ఓ అరుదైన రాజకీయ కలయికకు కేంద్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. ముగ్గురు కీలక నేతలు ఒకే వేదికపై కనిపించడం అక్కడున్న వారిని ఆకర్షించింది. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషతో కలిసి ఈ వేడుకకు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరువురూ నూతన దంపతులను అభినందించారు. ఒకే వేదికపై రాజకీయ, వ్యాపార, సినీ రంగ ప్రముఖులు సందడి చేయడంతో ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.