టీ20 సిరీస్ విజయం తర్వాత.. ఆక్లాండ్ శరవణ భవన్‌లో సందడి చేసిన గంభీర్
Advertisement
- న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా
- శరవణ భవన్‌లో భోజనం చేసిన కోచ్ గంభీర్
- గంభీర్‌తో ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న రెస్టారెంట్ యాజమాన్యం
- గంభీర్‌కు ముందే అక్కడికి వెళ్లిన కుల్దీప్, వరుణ్ చక్రవర్తి
- చెన్నై కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన శరవణ భవన్
Advertisement
టీమిండియా న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న తర్వాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాస్త భిన్నంగా సేదతీరాడు. విదేశీ గడ్డపై సిరీస్ విజయాన్ని పురస్కరించుకుని, ఆక్లాండ్‌లోని ప్రఖ్యాత భారతీయ రెస్టారెంట్ ‘శరవణ భవన్’లో గౌతీ భారతీయ భోజనాన్ని ఆస్వాదించాడు. ఈ సందర్భంగా రెస్టారెంట్ సిబ్బంది గంభీర్‌తో ఫోటో దిగి, దానిని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
"మరొక రోజు, మరొక అతిథి. ప్రపంచంలోనే నంబర్ వన్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయిన ఆక్లాండ్‌లోని శరవణ భవన్‌లో గౌతమ్ గంభీర్ విందు చేశారు. చక్ దే ఇండియా" అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ క్రికెట్ అభిమానులు గంభీర్ సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు.
అయితే, ఈ రెస్టారెంట్‌ను సందర్శించిన టీమిండియా బృందంలోని మొదటి వ్యక్తి గంభీర్ కాదు. అతడి కంటే ముందే భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కూడా ఇక్కడ భోజనం చేశారు. ఇటీవల తమ పర్యటనలో భాగంగా బాలీవుడ్ నటి యామీ గౌతమ్, ఆమె భర్త, ఫిల్మ్‌మేకర్ ఆదిత్య ధర్ కూడా ఈ రెస్టారెంట్‌ను సందర్శించారు.
1981లో పి. రాజగోపాల్ చెన్నైలో శరవణ భవన్‌ను స్థాపించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు భారతదేశంలో 30కి పైగా, విదేశాల్లో 40కి పైగా శాఖలతో ప్రపంచవ్యాప్తంగా శాఖాహార ప్రియుల మన్ననలు పొందుతోంది. దుబాయ్‌లో 2000 సంవత్సరంలో తొలి విదేశీ శాఖను ప్రారంభించిన ఈ సంస్థ, ఇప్పుడు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి అనేక దేశాల్లో తన ప్రాబల్యాన్ని చాటుకుంటోంది. విదేశీ పర్యటనల్లో ఉన్న భారతీయులకు సొంత ఇంటి భోజనాన్ని గుర్తుచేస్తూ శరవణ భవన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.