నా ఆఫర్‌ను నజ్రియా మూడుసార్లు తిరస్కరించింది: సూర్య

Entertainment
Advertisement
  • 12 ఏళ్ల తర్వాత తమిళంలోకి నజ్రియా రీఎంట్రీ
  • సూర్యతో సినిమాకు మూడుసార్లు నో చెప్పిన హీరోయిన్
  • నజ్రియా మంచి నటి అని సూర్య ప్రశంస
Advertisement
నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’. జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గతంలో తన మూడు సినిమాల్లో నటించాల్సిందిగా నజ్రియాను సంప్రదించగా, ఆమె తిరస్కరించినట్లు సూర్య వెల్లడించారు. "ఒక మంచి నటితో కలిసి పనిచేయాలని నేను అనుకున్నాను. మేము మూడుసార్లు అడిగాం, కానీ ఆమె తిరస్కరించింది. ఇది నాలుగో ప్రయత్నం, ఇప్పుడు ఓకే చెప్పింది. గత 12 ఏళ్లలో ఎంతోమంది దర్శకులు, నటుల ఆఫర్లను ఆమె వద్దనుకుంది. చివరకు మా సినిమాను అంగీకరించినందుకు ధన్యవాదాలు" అని సూర్య తెలిపారు. 

ఈ విషయంపై నజ్రియా స్పందిస్తూ... "12 ఏళ్ల తర్వాత నేను తమిళ సినిమాలో నటిస్తున్నాను. దీనికి ప్రధాన కారణం సూర్య సార్. గతంలో వేర్వేరు కారణాలతో ఆయనతో సినిమా అవకాశాలను వదులుకున్నా. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

యూఎస్ ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి.. వ్యంగ్యంగా స్పందించిన ఎలాన్ మస్క్

04 Nov, 13:48

రూ.2 కోట్ల లంచం ఆరోపణలు.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విజిలెన్స్‌ విచారణకు కేరళం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

04 Nov, 13:41

'ఇమ్మోర్టల్ ' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

04 Nov, 13:38

అమెరికా సెనేట్‌కు తొలి ముస్లిం.. చరిత్ర సృష్టించిన అబ్దుల్

04 Nov, 13:33

ఏడాది ముందే ఎల్‌నినో ముప్పు పసిగట్టొచ్చు.. శాస్త్రవేత్తల కొత్త పరిశోధన!

04 Nov, 13:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి: కూటమి పార్టీల నేతలకు చంద్రబాబు పిలుపు

04 Nov, 13:29

నా వికెట్ సెలబ్రేషన్ ఆమె కోసమే.. సీక్రెట్ చెప్పిన అర్ష్‌దీప్ సింగ్

04 Nov, 13:16

విదేశాలకు వెళ్తున్నారా?.. మీ వాట్సాప్‌పై ప్రభావం చూపే కొత్త నిబంధన!

04 Nov, 13:03

ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

04 Nov, 13:00

నంబర్‌ 3లో కోహ్లీ కింగ్‌.. వన్డేల్లో 13 వేల పరుగులతో ప్రపంచ రికార్డు!

04 Nov, 12:58

వికెట్‌ కోసం అత్యాశకు పోయాం.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తప్పును అంగీకరించిన అర్ష్‌దీప్‌!

04 Nov, 12:43

రిపబ్లికన్ కంచుకోటలో పాగా వేసిన డెమొక్రాట్.. కాన్సస్‌లో 94 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం

04 Nov, 12:42

శ్రీవారి సర్వదర్శనం జెట్ స్పీడ్‌.. క్యూలైన్లలోకి నేరుగా ప్రవేశం

04 Nov, 12:36

వాంగ్‌చుక్ సంస్థకు లడఖ్ సర్కార్ షాక్.. స్కూల్ కార్యకలాపాలు నిలిపివేయాలని నోటీసు

04 Nov, 12:35
..More Telugu News