కడప, విజయనగరం కార్పొరేషన్లు టీడీపీ కైవసం.. కూటమి క్లీన్ స్వీప్

Andhra
Advertisement
  • 65 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో కడప మేయర్ పీఠం గెలుపు
  • విజయనగరం మేయర్‌గా 18 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి విజయం
  • కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు గాను 58 టీడీపీ కైవసం
Advertisement
ఆంధ్రప్రదేశ్‌ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభంజనం సృష్టించింది. ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన కడప, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పీఠాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీకి కంచుకోటగా భావించే కడపలో సైతం టీడీపీ ఘన విజయం సాధించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

కడప నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి మాట్లి సువర్ణ దక్కించుకున్నారు. తన సమీప వైసీపీ అభ్యర్థి దీప్తిపై ఆమె ఏకంగా 65,588 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. సువర్ణకు మొత్తం 1,31,615 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడి 66 డివిజన్లకు గాను టీడీపీ 58 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4, జనసేన 2 డివిజన్లలో విజయం సాధించాయి.

విజయనగరం కార్పొరేషన్ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి అవనాపు భార్గవి 18,787 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడి మొత్తం 62 డివిజన్లలో టీడీపీ 35, జనసేన 6, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందగా.. వైసీపీ 16 డివిజన్లతో సరిపెట్టుకుంది. మరో రెండు స్థానాల్లో ఇతరులు విజేతలుగా నిలిచారు.

ఈ రెండు కార్పొరేషన్లే కాకుండా తిరుపతి, చిత్తూరు, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, కర్నూలు వంటి అనేక నగరపాలక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులే మేయర్ పీఠాలను దక్కించుకున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

TDPAndhra Pradesh Municipal ElectionsKadapa Corporation ResultsVizianagaram Corporation ResultsTDP Alliance VictoryMatli Suvarna

More Telugu News

ట్రంప్‌కు సవాలు విసురుతున్న జోన్ ఓసోఫ్.. జార్జియా నుంచి మళ్లీ గెలుపు!

04 Nov, 07:45

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్.. ఆధిక్యంలో డెమోక్రాట్లు!

04 Nov, 07:12

పట్టభద్రులకు ఊరట: తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు

04 Nov, 06:45

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

04 Nov, 06:44

డ్రైవర్ అప్రమత్తత... పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు

04 Nov, 06:21

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49
..More Telugu News