స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. ఇది సుపరిపాలనకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు
Advertisement
- స్థానిక ఎన్నికల ఫలితాలపై స్పందించిన సీఎం చంద్రబాబు
- సుపరిపాలనను చూసే ప్రజలు కూటమికి ఓటేశారని వెల్లడి
- రాజకీయాల కన్నా ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత అని ఉద్ఘాటన
- అమరావతి, పోలవరం పనులను వేగవంతం చేశామని వివరణ
- ప్రజలు మెచ్చే పాలన అందించడమే తమ లక్ష్యమని స్పష్టీకరణ
Advertisement
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. వెలువడుతున్న ఫలితాల్లో అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోందని తెలిపారు. సాయంత్రానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడి, మరింత స్పష్టత రానుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన అభివర్ణించారు.
"మేం చేస్తున్న సుపరిపాలనను మెచ్చి, మా పనితీరును గమనించే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. 'గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్' అనేదే నా ప్రాధాన్యత. రాజకీయమా, ప్రజల సమస్యల పరిష్కారమా అంటే.. నేను ఎప్పుడూ సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇస్తాను" అని చంద్రబాబు స్పష్టం చేశారు. అర్నబ్ తుపాను సమయంలో మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు సహాయక చర్యల్లోనే నిమగ్నమైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ.. "అనునిత్యం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే పనిచేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఇప్పటికే వెలిగొండ ద్వారా నీటిని అందించాం. అమరావతి పనులు పరుగులు పెట్టిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన రోడ్లను ఇప్పుడు నిర్మిస్తున్నాం" అని తెలిపారు. అయితే, అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పడం లేదని, వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయని ఆయన అంగీకరించారు. ప్రజలకు సేవలందించే విషయంలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.
కొందరు విమర్శలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా ప్రజాసేవకే అంకితమయ్యామని చంద్రబాబు అన్నారు. "లబ్ధి పొందుతూ కూడా ఎగతాళి చేసేవారు ఉంటారు. కులాలు, మతాలు, మాకు ఓటు వేయని వారు అనే భేదాలు మేం చూడటం లేదు. అందరి కోసం పనిచేస్తున్నాం. ప్రజలు మెచ్చే పాలన అందించి, వారి ఇబ్బందులను దూరం చేయడమే మా లక్ష్యం" అని వివరించారు. ప్రజలు ఇదే విధంగా కూటమిని ఆశీర్వదించి, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.